పవన్ కళ్యాణ్ కు దుబ్బాకలో ప్రచారం చేసే దమ్ముందా?
Timeline

పవన్ కళ్యాణ్ కు దుబ్బాకలో ప్రచారం చేసే దమ్ముందా?

పవన్ కళ్యాణ్ కు దుబ్బాకలో ప్రచారం చేసే దమ్ముందా? ఈ మాట అంటుంది మేము కాదు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, సపోర్టర్లు .

దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద పరీక్షలా మారింది. ఆరునూరైనా గెలిచి తీరాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ నేతలకు చెప్పారు.ఈ సారి కాంగ్రెస్‌ పార్టీ గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను బూత్‌ కమిటీ ఇన్‌చార్జీలుగా నియమించినట్లు వెల్లడించారు.

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఈ ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమని, ఇక్కడ ఫలితాన్ని అనుకూలంగా రాబట్టి కొత్త ఉత్సాహంతో భవిష్యత్‌ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అంతే కాదు ఎప్పుడూ కొట్టుకునే కాంగ్రెస్ నేతలు మొదటి సారి దుబ్బాక ఎన్నికల కోసం కాస్త యూనిటీ చూయిస్తున్నారు. తెరముందు ఉన్న ఈ యూనిటీ తెర వెనక ఎలా ఉందొ , ఎవరి మనసులో ఎన్ని కుట్రలున్నాయో దుబ్బాక ఫలితాలు వెలువడిన తరువాత , వారు అనుకున్నది తేడా కొడితే వారే మనకు చెప్తారు . కాబట్టి మనం పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక బీజేపీ పార్టీ క్యాండిడేట్ రఘునందన్ హరీష్ రావు ని ఏకి పారేస్తున్నారు కానీ తెరాస మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. బండి సంజయ్ ఏమో హైదరాబాద్ వర్షాలతో బిజీగా ఉన్నారు. దీనితో దుబ్బాక ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ ని దించే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. బీజేపీ జనసేన పొత్తు కుదిరిన తరువాత బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు. తెలంగాణాలో కూడా కలిసి పోరాటం చేయాలనీ చర్చలు జరిపారు.

అయితే ఆ కలిసి చేసే పోరాటానికి ఇపుడు సమయం వచ్చిందని , ఇక పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అసలైతే GHMC ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పాపులారిటీని వాడుకుందాం అని ప్లాన్ చేసిన బీజేపీకి దుబ్బాక ఎన్నికల రూపంలో కాస్త ముందుగానే అవకాశం దొరికింది.

అయితే పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై చేసిన విమర్శలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విషయం పవన్ కి కూడా బాగా తెలుసు. అందుకే తెలంగాణ రాజకీయాలనుండి సైడైపోయాడు పీకే. కేవలం ఆంధ్ర రాజకీయాలే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు . కానీ బీజేపీ తో దోస్తీ పవన్ మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేస్తున్నాయి.

తెలంగాణ ఏర్పడితే 11 రోజులు తినలేదు బాధతో అని చెప్పిన పవన్ కళ్యాణ్ కి తెలంగాణ లో రాజకీయం చేసే హక్కుందా అంటూ తెలంగాణ నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. అంతే కాకుండా కెసిఆర్ ని ఎదుర్కోవడం చంద్రబాబు కె చేత కాలేదు , రేవంత్ సైలెంట్ అవ్వక తప్పలేదు. ఇక జగన్ ఎన్నికల ముందే కెసిఆర్ హీరో అంటూ కితాబులిచ్చారు. దుబ్బాకలో ప్రచారం చేయడం అంటే డైరెక్టుగా కెసిఆర్ తో ధీ కొట్టడం లాంటిది. మరి పవన్ కి కెసిఆర్ ని ఎదుర్కునే దమ్ముందా అంటూ గట్టిగా డైలాగులు వినిపిస్తున్నాయి.

వీటికి జనసేన ఐటి సెల్ , బీజేపీ ఐటి సెల్ కాస్త ఘాటు విమర్శలే చేస్తున్నాయి కూడా .