పవన్ మళ్ళీ పూర్తిగా రాజకీయాలే, ఇక సినిమాలు చేయడట?
Timeline

పవన్ మళ్ళీ పూర్తిగా రాజకీయాలే, ఇక సినిమాలు చేయడట?

లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథలతో చిత్రాలు తెరకెక్కించే క్రిష్ దర్శత్వంలో కూడా పవన్ నటిస్తున్నాడని క్రిష్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ లో రూపొందుతోంది అని వార్తలు వచ్చాయి.

ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కథ కావడంతో క్రిష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నాడు అని. ఈ చిత్రానికి సంబందించిన ఒక్కో విశేషం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ఈ చిత్రంలో పవన్ దొంగగా నటిస్తున్నాడని.. దొంగిలించిన సొత్తుని పేదలకు పంచే మంచి దొంగగా పవన్ పాత్ర ఉండనున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి 13 ఏళ్ళ తరువాత గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో చిత్రం చేయబోతున్నాడని , హరీష్ కూడా ఒక ట్వీట్ దీని గురించి చేసాడు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ తో ఈ చిత్రం ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాలో ఒక పొలిటికల్ సినిమా ఉండబోతుందని ఇలా 2024 ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు వరకు తన డేట్స్ ఫిల్ అయ్యేలా సినిమా ప్లన్స్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.

ఇక పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని నిర్మాతలు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ కరోనా వారి ఆశలను అడియాశలు చేసేసింది.

ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు కి ఈ కరోనా భారీ నష్టమే మిగిల్చేలా ఉందట. కరోనా కన్నా ముందే పవన్ ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్ కి రాకపోగా వాయిదాలు వేసుకోవాల్సి వచ్చిందట. ఇక కరోనా వచ్చినప్పటి నుండి షూటింగులో లేవు. కేవలం 30 రోజుల్లో తీద్దాం అనుకున్న చిత్రం 3 నెలలుగా ఆగిపోయింది. దిల్ రాజు అంటేనే అన్ని సక్రమంగా ప్లాన్ చేసుకొని సినిమా రిలీజ్ వరకు ముందే కాలిక్యులేషన్స్ వేసుకునే నిర్మాత. కానీ వకీల్ సాబ్ విషయంలో అంచనాలు తారుమారు అయ్యాయి.

ఒక్క దిల్ రాజు విషయమే కాదు కరోనా తరువాత షూటింగులకు ప్రభుత్వం ఓకె చెప్పిన హీరోలు రెడీగా లేరట. ఇక థియేటర్లకు జనాలు వెళ్లే ఆలోచనలు లేనట్టే కనిపిస్తున్నాయి. సినిమా కన్నా ఆరోగ్యమే ఎవరైనా ఆలోచించేది.

ఇక పవన్ కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలవైపు ఉండబోతున్నారని సమాచారం. నిర్మాతలు కూడా భారీ బడ్జెట్లతో సినిమాలు చేసే ఉద్దేశంలో లేనట్టే పరిస్థితులు ఉండబోతున్నాయి. ఏదో చిన్న చిన్న బడ్జెట్లలో OTT ప్లాటుఫార్మ్స్ కోసమే ఇక సినిమాలు నిర్మించబోతున్నారు అనేది వాస్తవం,

Leave a Reply

Your email address will not be published.