పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్.. తన దైన శైలిలో ఆకట్టుకున్నారు. అంతేకాదు కోర్టులో వాదించడం తెలుసు.. కోర్టు తీసి కొట్టడం తెలుసు అంటూ మెట్రో రైలులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్ ని అలరించాయి. ఈ సినిమా కథ ఎక్కువగా మహిళల చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ సినిమాలో శృతితో పాటుగా, నివేద థామస్, అంజలి, అనన్యలు కూడా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఐతే ఈ సినిమా అప్డేట్ వచ్చిన ప్రతిసారి పవన్ తప్ప, మిగితా వారెవరు కనిపించకపోవడంతో కాస్త నిరుత్సహాంగానే ఉన్న ఫ్యాన్స్, ట్రైలర్ లోనైనా చూపించే ప్రయత్నం చేస్తారేమోనని ఆశిస్తున్నారు. మరికొందరు ఐతే టీజర్ లో ఓ షాట్ లో కనిపించిన ఫొటోలతో ఎడిటింగ్ లు చేసి మరి పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ రెడీ చేస్తున్న ట్రైలర్ కూడా కట్ అవుతుందంటున్నారు. త్వరలోనే మీ ముందుకు ఫ్యాన్ మేడ్ ట్రైలర్ వస్తుందంటూ.. ఇది నిర్మాత దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఈమేరకు ‘వకీల్ సాబ్’ ఫ్యాన్ మేడ్ ట్రైలర్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే దిల్ రాజు ‘వకీల్ సాబ్’ అప్డేట్ విషయంలో కాస్త ఆలస్యంగానే ఉండడంతో ఫ్యాన్స్ ఈ రకంగా అతడిపై సెట్టైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా వకీల్ సాబ్ సినిమా వచ్చేవరకు ఫ్యాన్స్ హంగామా తగ్గేలా కనిపించడం లేదు.
అయోధ్య రామాలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలు విరాళం ఇవ్వడానికి అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించారు. పవన్ రూ .30 లక్షలు విరాళంగా ఇచ్చారు. సంబంధిత చెక్కును ఆర్ఎస్ఎస్ ప్రముఖులు భరత్‌జీకి అందించారు.
పవన్ కల్యాణ్ ఒక ఆధ్యాత్మికవేత్త అవతారంలో కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం కడుతుంటే భారతీయులంతా, పిల్లాపాపలంతా విరాళాలు ఇస్తున్నారు. నా వంతుగా రూ.30 లక్షలు ఇస్తున్ననని పవన్ అన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా రూ.11వేలు ఇచ్చారు. కులాలకు, మతాలకు అతీతంగా రామ మందిర నిర్మాణానికి తన సిబ్బంది ముందుకు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు పవన్.
పవన్ కల్యాణ్ సాదాసీదాగా పూర్తి ఆధ్యాత్మిక వేత్త అవతారంలో ఆలయం నుంచి బయటికి రాగానే అభిమానులు ఆయన్ని చుట్టుముట్టారు.

పవన్ ఇటీవలే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఉన్నాడు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.