వెంకీతో ‘హాగ్’ బాధనిపించింది

11

‘RX 100’ ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ కంచ‌ర్ల హీరోహీరోయిన్లుగా శంక‌ర్ భాను ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘RDX లవ్’. రామ్ మునీష్ సమర్పకుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్రమాల‌ను పూర్తిచేసి సినిమాను అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

తరచూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే పాయల్ కు తన నెక్స్ట్ మూవీ ‘RDX లవ్’ లో బోల్డ్ పోస్టర్లకు.. బోల్డ్ యాక్టింగ్ కు విమర్శల ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో మీరు ట్రోలింగ్ గురించి ఎలా స్పందిస్తారు అంటే? అసలు అటువంటివి నేను పట్టించుకోను, కాకపోతే కొన్ని సార్లు హర్ట్ అవుతానని వెల్లడించింది.

మరి మీరు ఎప్పుడైనా హర్ట్ అయినా సందర్భం ఉందా? అని అడిగితే… కొన్ని రోజులు కిందట వెంకిమామ సెట్ నుంచి ఓ ఫోటో బయటకు వచ్చింది. అందులో నేను వెంకీ గారితో గౌరవం లేకుండా ప్రవర్తించానని ఒక వీడియో చేశారు.. అది వైరల్ అయింది. వాస్తవానికి అక్కడ జరిగింది వేరు. నన్ను వెంకీ గారు హగ్ చేసుకునే టైములో నేను ఏదో తింటున్నా ఆ టైములో ఆయన నన్ను హగ్ చేసుకోవడం సరి కాదు అని కొంచెం దూరం నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చాను. కానీ నేనేదో తప్పు చేసినట్టు ప్రచారం చేశారు” అంటూ వాపోయింది.