దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై పలవురు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని న్యాయవాదులు జీఎస్‌ గనీ, ప్రదీప్‌ కుమార్‌లు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

అలాగే ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ సందర్భంగా 2014లో అత్యున్నత న్యాయస్థానం రూపొందించిన మార్గదర్శకాలను పోలీసులు విస్మరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కొత్త వార్తలు