మీకు బైక్ కానీ కారు కానీ ఉందా? ఏవ్ కాదు ఏ ఇతర వాహనం అయినా ఉందా? ఉందంటే మీరు తప్పకుండ పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకోడానికి రోజూ దగ్గర్లో ఉన్న బంకుకు వెళ్తుంటారు కదా? అయితే ఈ న్యూస్ మీరు చదవాల్సిందే. ఇన్ని రోజులు పెట్రోల్ లేదా డీజిల్ కల్తీ చేసి మోసాలు చేసిన పెట్రోల్ బంక్ యజమానులు కాస్త అప్ గ్రేడ్ అయ్యారు. జనాలను ఫూల్స్ ని చేసే పనిలో బాగా తెలివి సంపాదించారు.

ఇంతకు ముందు పెట్రోల్ బంకుల్లో పని చేసే వారు యజమానులు చెప్పిన ప్రకారం, వినియోగదారులను డైవర్ట్ చేసేలా మాటల్లో పెట్టి ఇచ్చిన డబ్బుకి కొట్టాల్సిన దాని కన్నా కాస్త తక్కువగా పెట్రోల్ కొట్టేవాళ్ళు. ఆ మోసం కూడా బట్ట బయలు అయ్యాక, ఎలక్ట్రానిక్ డిస్ప్లే లు వచ్చాయి. ఇపుడు మనం ఎంత ఇస్తున్నాం , వాడు ఎంత కొడుతున్నాడు అనేది దానిలో ముందే ఎంతకు ఎంత కొట్టాలి అనేది రికార్డ్ అయి ఉండడం తో వినియోగదారుడికి కనిపిస్తుంది కదా అని ఆ నంబర్లు చూసి మనం లైట్ తీసుకుంటున్నాం. అక్కడ కనిపిస్తే చాలు అదే నిజం అనుకుంటున్నాం.

కానీ లేటెస్ట్ గా మన హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేసిన ఈ పెట్రోల్ బ్యాంకుల స్కామ్ గురించి తెలిస్తే మాత్రం మనం కంగు తినడం కాయం. ఎందుకు డౌట్ వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఎలక్ట్రానిక్ చిప్ ల సహాయంతో పెట్రోల్ బ్యాంకులలో తప్పుడు నంబర్లు చూయించే స్కామ్ ని బయట పెట్టేసారు .

సీపీ సజ్జనార్

పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించేలా ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చే ముఠా, పెట్రోల్ బంక్ నిర్వహకులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ నేరాలకు పాల్పడుతున్న అనేక ముఠాలను సైబరాబాద్ పరిధిలో అరెస్టు చేశామని, అంతే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకులను సీజ్ చేసినట్లు , ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న 22 బంకులను అక్కడి పోలీసులు సీజ్ చేశారని చెప్పారు.

ఈ దందాలో శుభమ్ పాషా అనే వ్యక్తి కీలక సూత్రధారి అని చెప్పారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న తీరుపై సజ్జనార్ శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు.

మహారాష్ట్ర నుండి ప్రత్యేక చిప్‌లను తయారు చేయించి, ఇక్కడికి తెప్పించి పెట్రోల్ బంకు నిర్వహకులు వీటిని అమర్చి అక్రమాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ‘‘వీరు రోజూ రూ.లక్షలలో మోసం చేస్తున్నారు. డిస్‌ప్లే మిషన్‌కు లోపల 2 చిప్‌లు అమర్చి, మీటర్ మాత్రం కరెక్టుగా చూపించే విధంగా భారీ మోసం చేస్తున్నారు. ఇది ఒక గ్యాంగ్‌గా ఏర్పడి సుభాని పాషా కనుసన్నల్లో జరుగుతోంది. ఈ చిప్ అమర్చడం వల్ల ప్రతి వెయ్యి మిల్లీ లీటర్ల ఇంధనానికి 30 మిల్లీలీటర్లు తక్కువగా వస్తుంది.’’

‘‘11 ఫ్యూయల్ స్టేషన్లలో 13 చిప్స్ పెట్టారు. వీటిని సీజ్ చేశాం. మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, హుజూర్ నగర్, అర్ సీ పురం, మిరియాల గూడలో చిప్‌లు అమర్చారు. ఫిజికల్‌గా చెక్ చేస్తే తప్ప ఈ మోసం బయట పడదు. నిందితుల నుంచి 14 ఐసీఎస్ చిప్‌లు, 8 డిస్‌ప్లేలు, 3 జీబీఆర్ కేబుల్స్, 1 మదర్ బోర్డ్ సీజ్ చేశాం. అరెస్టు చేసిన 28 మందిపై పీడీ యాక్టు నమోదు చేశాం. ఇంకా ఐదుగురు యజమానులు పరారీలో ఉన్నారు. నందిగామలోనూ ఈ ముఠా అరెస్టు అయింది. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరుపుతాం’’ అని సజ్జనార్ చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ లో సీజ్ చేసిన పెట్రోల్ బ్యాంకులు ఇవే

తెలంగాణాలో సీజ్ చేసిన పెట్రోల్ బ్యాంకులు ఇవే

Leave a Reply

Your email address will not be published.