Breaking News :

పింక్ టెస్ట్: ఆ డబ్బులు వాపస్

చారిత్రక పింక్‌ బాల్‌ డే అండ్ నైట్‌ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 46 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ విజయం సాధించింది. గులాబి బంతి మ్యాచులో కోహ్లీ తొలి శతకం బాదగా, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె అర్ధశతకాలు బాదేశారు. బుల్లెట్‌ బంతులతో చెలరేగిన భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఐదు వికెట్లు, ఇషాంత్ నాలుగు వికెట్లు తీసుకున్నారు. దీంతో రెండు టెస్టుల సీరిస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. కాగా ఈ మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగియడంతో నాలుగు, ఐదో రోజు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం తిరిగి డబ్బులు చెల్లించనుంది.

Read Previous

కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

Read Next

ముగిసిన భేటీ.. కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ