ట్రెండింగ్ అవుతున్న పిన్నీ 2 ..

‘పిన్నీ 2’ సీరియల్. ‘కృష్ణమ్మకు గోదారికి తోడెవరమ్మా’ అంటూ జెమినీ టీవీలో ప్రసారమైన ‘పిన్నీ’ సీరియల్‌ను ఎవరూ మరిచిపోయి ఉండరు. రాధిక లీడ్‌ రోల్‌లో చేసిన ఈ సీరియల్ అప్పట్లో పెద్ద సంచలనం. 1999లో సన్‌ టీవీలో వచ్చిన చిట్టి సీరియల్‌ తెలుగులో పిన్నీ పేరుతో టెలికాస్ట్‌ (డబ్బింగ్‌) అయింది. 2001 నవంబర్‌ వరకు సాగిన ఈ సీరియల్‌ దాదాపు 20 ఏళ్ళ తరువాత ‘పిన్నీ 2’గా సీక్వెల్ రాబోతుంది

ఇపుడు ఈ సీక్వెల్ టైటిల్ సాంగ్ కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది. వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో , ట్విట్టర్ లో షేర్ చేసి మరీ వారి చిన్నప్పటి జ్ఞాపకాలను , ఈ సీరియల్ తో ఉన్న అనుబంధాన్ని ఇప్పటి తరం వారితో పంచుకుంటున్నారు.

Read Previous

డ్రోన్ కేసు: రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

Read Next

#BigShoppingDays: 6 నుంచి 50 వేల లోపు ఏ మొబైల్స్ కొనాలి ?