బెంగాల్ కు మోడీ వెయ్యి కోట్ల సాయం

ఆంఫన్ తుపానుతో అతలాకుతలమైన పశ్చిమబెంగాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. తుపాను తీవ్రతను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు, సీఎం మమతాబెనర్జీతో కలిసి ఆయన ఏరియల్ సర్వే జరిపాక ఈ ప్యాకేజీ ప్రకటించారు. దాదాపు మూడు నెలల తర్వాత మోడీ మొదటి పర్యటన ఇదే. 

ఆంఫన్ తుపాను కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్న మోదీ కష్టకాలంలో బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాత్కాలిక సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిశాక మరింత సాయం చేస్తామని చెప్పారు. 

పునరావాసం, పునర్నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలు పరిష్కరించబడతాయని ప్రధాని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముందుకు సాగాలని మనమందరం కోరుకుంటున్నాము. ని చెబుతూ ఈ పరీక్షా సమయాల్లో కేంద్రం పశ్చిమ బెంగాల్‌తో ఎల్లప్పుడూ నిలుస్తుందని హామీ ఇచ్చారు. “బెంగాల్ మళ్లీ తన పాదాలకు నిలబడేలా మేము కలిసి పనిచేస్తాము” అని ప్రధాని పేర్కొన్నారు.   

రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని వైమానిక సర్వే తర్వాత ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్‌హాట్‌లో పిఎం మోడీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం కూడా ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ  50,000 సాయం ప్రకటించారు.