గుడ్ న్యూస్ చెప్పిన మోడీజీ
Timeline

గుడ్ న్యూస్ చెప్పిన మోడీజీ

పండుగ సీజన్ సందర్భంగా ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) రాయితీలను ప్రకటించింది. ఇప్పుడు వీటిని ప్రైవేటు ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. COVID-19 మహమ్మారి కారణంగా ప్రయాణాలు చేయలేక, LTAపై పన్ను మినహాయింపు పొందలేకపోయిన వారికి ప్రభుత్వ LTC వోచర్ పథకం ఉపయోగపడుతుంది.

ఈ పథకం ప్రకారం.. 12 శాతానికి పైగా జీఎస్టీ ఉండే వస్తువులు, సేవలను కొనడానికి LTAకు మూడు రెట్లు ఖర్చు చేస్తే, దానిపై మినహాయింపు లభిస్తుంది. ఈ కొనుగోళ్లు మార్చి 31, 2021 లోపు చేయాలి. అది కూడా డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయాలి. క్లెయిమ్ చేసుకోవడానికి బిల్లులను సమర్పించాలి. ఉద్యోగులు నాలుగు క్యాలెండర్ ఈయర్స్ బ్లాక్ లో రెండుసార్లు LTA ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఈ పథకం ప్రకారం ఒక కుటుంబ సభ్యుడికి అత్యధికంగా రూ.36,000 చొప్పున ప్రయోజనాలు పొందడానికి అర్హత ఉంటుంది.