భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్‌లెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు
Timeline

భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్‌లెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు

దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ డ్రైవర్‌లెస్ ట్రైన్ ఢిల్లీలో పరుగులు పెడుతుంది. ఈ హైటెక్ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్‌లో ఆటోమేటెడ్ రైలు పట్టాలపై నేటి నుంచి పరుగులు పెట్టనుంది.. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రైవర్‌లెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. కానీ భారత్‌లో మాత్రం అలాంటి ఫుల్లీ ఆటోమెటెడ్ డ్రైవర్‌లెస్ ట్రైన్ ఇప్పటి వరకు లేదు. మన దేశంలో రైళ్లు నడవాలంటే లోకో పైలట్‌ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈరోజు నుండి అంటే సోమవారం నుంచి డ్రైవర్ లెస్ ట్రైన్ అందుబాటులోకి రాబోతోంది. ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైలును 3 కమాండ్ సెంటర్ల నుండి ఆపరేట్ చేస్తారట. ఒకవేళ రైలులో ఏ సమస్య వచ్చిన CBTC టెక్నాలజీతో అవి బాగు చేయొచ్చట. 2017 లో మొదలు పెట్టిన డ్రైవర్ లెస్ ట్రైన్ ప్రయత్నం ఎట్టకేలకు ఇపుడు ప్రజలకు అందుబాటులో వచ్చింది.

Leave a Reply

Your email address will not be published.