మహాత్ముడికి నివాళులర్పించిన ప్రధాని

5

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దేశ మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్‌ఘాట్‌లో మోదీ నివాళి అర్పించారు.