Breaking News :

జగన్ కి మోడీ ఫోన్ …

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు, భారత ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేశారు. కాగా ప్రస్తుత కాలంలో చాలా భయంకరంగా విస్తరిస్తున్న వ్యాపిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా, ఈ వైరస్ ని నివారించడానికి తీసుకుంటున్న చర్యలను, బాధితులకు అందిస్తున్న చికిత్స తదితర అంశాలపై చర్చ జరిపారని సమాచారం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎందుకు పెరిగిందన్న విషయంపైనే ఇరువురి మధ్య చర్చ జరిగిందని సమాచారం. కాగా పీఎం మోడీ ప్రశ్నలకు సమాధానంగా స్పందించిన సీఎం జగన్ మాట్లాడుతూ, “కరోనా కట్టడికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలూ తీసుకున్నామని, వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా శానిటేషన్ పనులు చేస్తున్నామని చెప్పారు.

అంతేకాకుండా ప్రస్తుతానికి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అందుకు గాను కేంద్రం నుండి రావాల్సిన నిధులను ఇటీవలే లేఖ కూడా రాసానని సీఎం జగన్ వివరించారు. ఇకపోతే పోలవరం ప్రాజెక్టుకు నిధులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు, జీఎస్టీ పరిహారం కింద రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని జగన్‌ కోరాడు. దానికి ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం.

Read Previous

బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ లో మరో 14 కొత్త కేసులు

Read Next

జంతువుల్లో కరోనా కన్ఫామ్: పరిస్థితి చేజారనుందా ?