Breaking News :

అల ఈవెంట్ పై పోలీస్ కేసు

ఈ నెల 6న సాయంత్రం జరిగిన ‘ అల వైకుంఠపురంలో’ సినిమా మ్యూజిక్‌ కన్సర్ట్‌ అదిరిపోయింది. ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ నిర్వహించడంతో ఎక్కవమంది ఫ్యాన్స్ హాజరయ్యేందుకు అవకాశం దక్కింది. మొత్తానికి ఈవెంట్ సూపర్ హిట్. మూవీకి కావాల్సినంత బజ్.

కానీ ఈ కార్యక్రమం వల్ల పోలీసులు, ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. అందుకే కేసులు వరకు వెళ్లింది వ్యవహారం. పర్మిషన్స్‌కు విరుద్దంగా ఈవెంట్ నిర్వహించినందుకుగానూ శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు యగ్నేష్ అనే మూవీ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 2వ తేదీ ఈవెంట్‌కు సంబంధించి పోలీసులు పర్మిషన్ తీసుకున్నారు నిర్వాహకులు.

5వేల నుంచి 6 వేల వరకు ఫ్యాన్స్ హాజరవుతారని, రాత్రి 10 గంటలలోగా కార్యక్రమం ముగిస్తామని పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.

అయితే అక్కడ పూర్తి రివర్స్‌గా సీన్ నడిచింది. దాదాపు 15 వేల వరకు పాస్‌లు పంచడంతో, అధిక సంఖ్యలో జనాలు తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. యూసప్‌గూడ్ రూట్‌లో ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు రాత్రి 11: 30 గంటల వరకు ఈవెంట్ కొనసాగింది. పోలీసులు ఎన్నో అవస్థలు పడ్డారు. అనుమతులకు విరుద్దంగా ఈవెంట్ నిర్వహించి, ప్రజల అసౌకార్యానికి కారకులయ్యారని శ్రేయాస్‌ మీడియా ఎండీ శ్రీనివాస్‌తో పాటు యగ్నేష్‌పై జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ నవీన్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరుగుతోంది.

Read Previous

పవన్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్

Read Next

‘జాను’ టీజర్ విడుదల