బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పై పోలీస్ కేస్.. రేపు అరెస్ట్?
Timeline

బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పై పోలీస్ కేస్.. రేపు అరెస్ట్?

ట్రాక్టర్ నడుపుతూ అదుపు తప్పిన నారా లోకేష్

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతుంది. జగన్ Vs చంద్రబాబు రివెంజ్ గేమ్ అంటూ వినిపిస్తున్న / కనిపిస్తున్న వార్తల్లో వీళ్ళు తప్ప అందరూ కనిపిస్తున్నారు తెర మీద. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు నాయుడు తన పలుకుబడి ఉపయోగించి జగన్ ని టార్గెట్ చేసిన విధానం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూసారు.

కానీ ఇప్పుడు స్టోరీ రివర్స్ అయింది. జగన్ అధికారంలోకి రావడం , అది కూడా టీడీపీ పతనం దిశగా అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, ఓటు కు నోటు కేసులో హైదరాబాద్ వదిలి ఆంధ్రాకి వచ్చిన బాబు ని మళ్ళీ జగన్ తిరిగి హైదరాబాద్ పంపడం, టీడీపీ పెద్ద పెద్ద నేతలను నెలకొకరి చొప్పున వారి అక్రమాలు బయటపెడుతూ జైల్లోకి నెట్టడం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం.

ఇంకెప్పుడు బాబు వంతు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న వేళా ఆ అవకాశం లోకేష్ ని వెతుక్కుంటూ వచ్చిందంటూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఈరోజు లోకేష్ ట్రాక్టర్ నడుపుతూ అదుపు తప్పిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవటం, స్టీరింగ్ కంట్రోల్ చేయడమే చేతకాదు , ఇంకా సీఎం కుర్చీ ఎక్కి సిస్టమ్ సెట్ చేస్తాడా అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం తెలిసిన విషయమే.

అయితే ఇంతకీ ఆ సంఘటన ఎలా జరిగింది , ఎక్కడ జరిగిందనే వివరాల్లోకి వెళితే, ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ పై పార్టీ కార్యకర్తలను ఎక్కించుకొని , తానే స్వయంగా నడుపుతూ ర్యాలీ నిర్వహించిన లోకేష్ బాబు అనుకోకుండా స్టీరింగ్ కంట్రోల్ చేయలేక ట్రాక్టర్ అదుపు తప్పింది. అయితే ఈ విషయంపై ఆంధ్ర పోలీసులు నారా లోకేష్ పలువురి ప్రాణాలకు విలువ లేకుండా , ఇలాంటి అవగాహనా లేని పనులు చేయడం తప్పని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ లో లోకేష్ పై కేసు నమోదు చేసారు.

కోవిడ్  19 నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు సుమోటోగా మరో కేసు కూడా నమోదు అయిందని సమాచారం.

అయితే ఇంత చిన్న వంకతో లోకేష్ ని అరెస్ట్ చేయడం జరిగే పని కాదు కానీ మరి చేస్తారా లేదా అనేది రేపు తెలుస్తుంది . లోకేష్ ని అరెస్ట్ చేయడానికి ఇంత సిల్లీ రీజన్ జగన్ వాడరు . దానికోసం లోకేష్ చేసిన స్కామ్స్ అంటూ వైసీపీ నేతలు రోజుకొకటి మీడియాలో చెప్తూనే వస్తున్నారు. కాబట్టి వాటిని ఆధారాలతో చూయించి అప్పుడు లోకేష్ ని జైలు కు పంపుతారనేది వైసీపీ నేతల నుండి అందుతున్న సమాచారం