spot_imgspot_img

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్..చంద్రబాబు పై పోలీస్ కేస్

65 రోజుల తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో విమానాలు రద్దవడంతో హైదరాబాద్ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరిన చంద్రబాబు పలుచోట్ల కారు దిగి మరీ జనాలను పలకరించారు. దీంతో బాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి.

చంద్రబాబు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి హైకోర్టుకు ఫిర్యాదు చేసారు. అంతే కాకుండా చిత్తూరు జిల్లాకు చెందిన మొమమ్మద్ అలీ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు లాక్‌డౌన్‌ రూల్స్‌ ఉల్లఘించారని  వీడియోలను ఆధారాలుగా సమర్పిస్తూ ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో అలీ ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదుకు సంబంధించిన కాపీ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related Articles

Get in Touch

18,128FansLike
3,038FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts