పక్క రాష్ట్రంలో వస్తే సాయం – మన రాష్ట్రంలో వస్తే రాజకీయం
Timeline

పక్క రాష్ట్రంలో వస్తే సాయం – మన రాష్ట్రంలో వస్తే రాజకీయం

ఎడతెరిపి లేని వానలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ముఖ్యంగా వరద తాకిడి తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉండటంతో హైదరాబాద్ జలమయం అయింది. హైదరాబాద్ లో గత వందేళ్లలో ఇదే మొదటి సారి ఇలాంటి భారీ వర్షపాతం నమోదు కావడం అని అటు అధికారులు చెప్తున్నా , ప్రతి పక్షాలు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ రాజకీయం చేస్తున్నారు.

కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోయినప్పటికీ బురద పేరుకుపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ మళ్లీ జలమయమం అయ్యాయి. సూరీడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు.

వారం ముందు నుండే ప్రభుత్వం ముంపు ప్రాతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసింది. సేఫ్టీ ప్లేసులకు తరలించింది వాళ్ళను. అయినా కొన్ని ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నాళాలు ఆక్రమించి కట్టుకున్న చాల మందికి ఈ పరిస్థితి ఎదురయింది అనుకుంటే పొరపాటే. పెద్ద పెద్ద సెలెబ్రిటీల ఇల్లులు, ఎత్తులో ఉన్న భవనాల ఇల్లు కూడా ఈ నీటిలో మునిగిపోవడం ఆశ్చర్యం. కానీ అధికారులు చెప్పినట్టు ఇది అందరికి కొత్త, ఇలాంటి వర్షం 100 ఏళ్ళ తరువాత ఇప్పుడే రావడం. అది కూడా హైదరాబాద్ లాంటి మహా నగరం.

ఇప్పటికే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఇల్లు కోల్పోయినవారికి, గాయపడ్డవారికి ప్రభుత్వం తరపున సాయం ప్రకటించింది. ఇంకా వర్షాలు ఆగకపోవడం వళ్ళ మరో వారం వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము . పక్క రాష్ట్రాల నుండి పడవలు తెప్పిస్తున్నారు. వాటి సాయంతో వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెలికాఫ్టర్లు సిద్ధం చేసారు. ఆహారం , సరకులు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మొన్నయితే ఒక గర్భిణీ స్త్రీ కోసం ఏకంగా మెట్రో రైలును సిద్ధం చేసారు. వీరిని వారిని అంటూ తేడా లేకుండా అందరికి అన్నీ అందేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలపై ఈ సమయంలో ట్రోల్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొందరు నెటిజన్లు.

చెన్నై , కేరళ లాంటి రాష్ట్రాల్లో వరదలు సంభవించినపుడు సాయం గురించి మాట్లాడి , వాళ్ళ కోసం దేవుడిని వేడుకోండి అంటూ ట్వీట్లు చేసిన ఈ జనమే వారికి ఆశ్రయం ఇచ్చి , బ్రతుకు తెరువును చూయించి , తిండి పెడుతున్న హైదరాబాద్ కష్టాల్లో ఉంటె మాత్రం హైదరాబాద్ ని దుమ్మెత్తిపోస్తున్నారు. హైదరాబాద్ సిటీ పై ట్రోల్ల్స్ , మీమ్స్ , జోక్స్ వేస్తూ వారి ప్రియమైన నేతల మనసు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

వాళ్లకు అర్ధం కానీ విష్యం ఏంటంటే ప్రకృతికి అందరూ సమానమే – ఇవ్వాళ్ళ వాళ్ళు రేపు నువ్వు , నేను.. ఇలా అందరం ప్రకృతి ఆగ్రహానికి బలి కావాల్సిందే.

ప్రజానాయకులు, అధికారులు సాయం చేయడానికో , బాగోగులు చూడటానికో ,ఇలాంటి సమయాల్లో వస్తే ఆవేశంతో వారిని నిందించడం వళ్ళ ఎటువంటి ఉపయోగం లేదు . వాటికోసం ఎన్నికలున్నాయి. అయినా ఎవరికి ఓటేసిన హైదరాబాద్ మునిగిపోదు అనే గ్యారెంటీ లేదు. ఇది 100 ఏళ్ళ క్రితం నిర్మించిన నగరం. ఇది ఇపుడు మార్చాలంటే ఎన్నో లక్షల ఇండ్లు కూల్చాలి. ఎవరైతే ప్రబుత్వాని ప్రశ్నిస్తున్నారో మొదటగా వారి ఇండ్లే కూల్చాల్సిన పరిస్థితి ఉంది వాస్తవానికి. ఎందుకంటె వారు ఇండ్లు కట్టుకున్నది చెరువులు ఆక్రమించి అన్న విషయం తెల్సిందే.

అక్రమ కట్టడానికి అనుమతులు ఎవడిమ్మన్నాడు అని అంటే , అక్రమ కట్టడం కోసం లంచం ఎందుకిచ్చావ్ అనేదాకా వస్తుంది. ప్రభుత్వాలు ఎలాగో అంతదాకా తెచ్చుకోవు ఎందుకంటె మళ్ళీ వారికి ఓట్లు కావాలి కాబట్టి.

కనీసం మనం అయినా మన నగరంపై బురద చల్లే ప్రయత్నాలు ఆపి వీలైతే నలుగురికి సాయం చేయడానికి ముందుందాం