ప్రముఖ టెలివిజన్ సీరియల్ నటి మరియు హోస్ట్ చిత్ర తమిళ సీరియల్ పాండియన్ స్టోర్స్‌లో తన పాత్రతో ఖ్యాతి గడించారు. డిసెంబర్ 9, బుధవారం చెన్నైలోని నజ్రత్‌పేట్‌లోని ఒక హోటల్ గదిలో శవమై కనిపించారు. పాండియన్ స్టోర్స్ ముల్లై కతిరావన్ అకా ముల్లాగా చిత్ర పాత్ర ప్రముఖ ప్రధాన పాత్రలలో ఒకటి. ఆమె వయసు 29 మరియు ఆత్మహత్య ద్వారా ఆమె మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం , షూటింగ్ పూర్తయిన తరువాత బుధవారం ఉదయం 1 గంటకు ఆవిడ తన హోటల్ గదిలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఉదయం 3:30 గంటల సమయానికి హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలిపారు . ఇంకా పోర్ర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మేము ఆమె మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అని అక్కడి పోలీసులు మీడియాకి తెలిపారు. చెన్నైలో నివసిస్తున్న చిత్ర కుటుంబ సభ్యులకు పోలీసులు ఆమె మరణం గురించి తెలియజేసారు.
చిత్ర తమిళ్ సీరియల్స్ ద్వారా చాలా పాపులర్. ఎన్నో టీవీ షోస్ కూడా ఆవిడ హోస్ట్ చేశారు. అటు యాంకర్ గా ఇటు సీరియల్ నటిగా సంపాదించింది చిత్ర. చిత్ర నటించిన పాండియన్ స్టోర్స్ తమిళ్ సీరియల్ ను తెలుగులో వదినమ్మ గా చిత్రీకరిస్తున్నారు.
చిత్ర ఈ మధ్యనే ఆగష్టు లో ఒక బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్ధం జరిగింది. అంతే కాకుండా ఒక తమిళ్ సినిమాలో కూడా నటించడానికి చిత్ర అగ్రిమెంట్ సైన్ చేసినట్టు సమాచారం. ఒక్కసారిగా ఆమె మరణంతో చిత్ర అభిమానులు షాక్ కి గురయ్యారు.