గోదావరిఖనిలో ప్రభాస్ ‘సలార్’ షూటింగ్
Timeline

గోదావరిఖనిలో ప్రభాస్ ‘సలార్’ షూటింగ్

ఇటీవలే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తిచేసిన రెబల్ స్టార్ ప్రభాస్.. తర్వాత ‘సలార్’ మూవీ చిత్రీకరణ కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమలు హైదరాబాద్‏లో జరిగింది. కెజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల గోదావరిఖనిలో జరగనుందట. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ మూవీకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. యాక్షన్ సన్నివేశాలను గోదావరిఖనిలోని ఓపెన్ కాస్ట్ మైనింగ్ 2 లో షూట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భారీ సెట్స్ ను తయారుచేస్తున్నారు చిత్రయూనిట్. ఆ సెట్స్ సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజీఎఫ్ 2 టీజర్ లోను ఇలాంటి లొకేషన్లనే చూపించడం విశేషం.

1 Comment

Leave a Reply

Your email address will not be published.