ప్రాన్స్ తో సాంబార్.. కావలసిన పదార్థాలు.. తయారీ విధానం

21

ప్రాన్స్ తో కర్రీ చేసుకుంటారు లేదా బిరియాని చేసుకుంటారు.. అది కూడా లేదంటే ఇగురు పెట్టుకుంటారు. కానీ, వెరైటీగా ప్రాన్స్ తో సాంబార్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:
రొయ్యలు : పావు కిలో
ఆనియన్స్ : రెండు
అల్లం వెల్లులి : సరిపడా
కారం : సరిపడా
నూనె : రెండు స్పూన్లు
టమోటాలు : నాలుగు
పసుపు : కొద్దిగా
సాంబార్ మసాలా : రెండు స్పూన్లు
కొబ్బరి తురుము : కొద్దిగా
వెనిగర్ : అరస్పూన్
కొత్తిమీర : కొద్దిగా
ఉప్పు : తగినంత

తయారీ విధానం :

స్టవ్ వెలిగించి ఫాన్ పెట్టుకొని నూనె వేసి అందులో ఆనియన్స్ వేసి వేగనివ్వాలి.. ఆ తర్వాత అందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. అది కాస్త వేగాక అందులో టమోటా, అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు కారం, వెనిగర్, సాంబార్ మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. అలా అది దగ్గర పడ్డాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రాన్స్ సాంబార్ రెడీ.