గోమాతను పూజించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే హన్మకొండలో ఏకంగా ఆవుకు సీమంతం చేశారు. హన్మకొండ ఎస్బీహెచ్ కాలనీలోని పీజేఆర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న పాశికంటి వీరేశం, శోభ దంపతులకు నలుగురు కొడుకులు. ఆడబిడ్డ లేదనే దిగులు వారిని వెంటాడుతుండేది. ఈ క్రమములోనే ఆవును కొని సొంత కూతురిలా పెంచుకుంటున్నారు. ఆవు గర్భం దాల్చిందని తెలియడంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో సీమంతం చేశారు. కాగా, వరంగల్ కాశీబుగ్గ రామాలయం పూజారి మధుచారి సమక్షంలో ఆవుకు సీమంతం నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆవుకు గాజులు, పూలు, పండ్లు, చీరె, పసుపు, కుంకుమ పెట్టి వైభవంగా వేడుక జరిపారు.
Timeline
Viral
హిందూ సంప్రదాయమంటూ.. ఆవుకు సీమంతం
- by Telugucircles
- January 18, 2021
- 0 Comments
- 7 Views
