నా భర్తకు మద్యం అలవాటు లేదు, ప్లాన్ చేసే ఫుల్ గా తాగించారు

16

తెలంగాణ వైద్యురాలు దిశపై అత్యాచారం, హత్య ఘటనలో ఏ4 నిందితుడు చెన్నకేశవులు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు గత నెల 27న పశువైద్యురాలు దిశపై రేప్, హత్యచేసిన నిందితుల్లో ఒకరు. ఇకపోతే చెన్నకేశవులు ఈ ఏడాది రేణుక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం చెన్నకేశవులు భార్య గర్భిణీ. తన భర్త చేసిన దారుణాన్ని తలచుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తకు మద్యం అలవాటు లేదని, ప్లాన్ ప్రకారమే ఫుల్ గా మద్యం తాగించి ఇలాంటి దారుణానికి ఒడిగట్టించారని ఆరోపించారు. తన భర్తకు ఉరివేయోద్దని తాను కోరనని తెలిపారు. తన భర్తను తనకు అప్పగించాలని కోర్టును కోరినంత మాత్రాన తనకు అప్పగిస్తుందా అని నిలదీశారు. ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి నలుగురికి ఎలాంటి శిక్ష వేశారో తన భర్తకు కూడా అలాంటి శిక్షే వేయాలని ఆమె సూచించారు.