విచారణలో వాస్తవాలు

60

యావత్ భారతదేశం తలదించుకునేలా వున్న హైదరాబాద్ హత్యోదంతం ఫై విచారణ చేపట్టిన పోలీసులు ఒళ్ళు గగుర్పొడిచే వాస్తవాలను తెలిపారు. ఏమో సార్, అపుడు మేం ఫుల్ గా తాగి వున్నాం. ఏం చేస్తున్నామో సోయి లేదు. పొద్దుట్నుంచి లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా యువతీ కనిపించగానే ఎదో ఒకటి చేయాలనుకున్నాం అంటూ దిశా నిందితులు విచారణలో తెలిపారు. విచారణలో నిందితుల మాటలు విన్నాక పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు.

దిశా ఆలస్యంగా వస్తేనే తమ పని సులువుగా అవుతుందని భావించారు ఆ నలుగురు నిందితులు. అయితే తాను తొమ్మిది గంటల తరువాత రావడం, తనని అలా అత్యాచారం హత్య చేయడం, కాల్చి చంపేస్తే ఇంత దూరం వస్తుందని అనుకోలేదు అని చెప్పడంతో పోలీసులు కాదు తిన్నారు.

అయితే వారు అక్కడికి ఎందుకు చేరుకున్నారు అనే దాని ఫై విచారణ జరుపగా, మహ్మద్ ఆరిఫ్ పాషా దొంగలించిన ఇనుప కడ్డీలను అమ్ముదామని నవీన్, చెన్నకేశవులని పిలిచాడు. అక్కడ దానిని అమ్మేసి, 26 వ తేదీ రోజున రాత్రి సమయానికి శంషాబాద్ దగ్గర తొండుపల్లికి చేరుకున్నారు. మర్నాడు ఉదయం 9 గంటలకు తొండుపల్లి ఓఆర్ ఆర్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 5:30 గంటలకి మద్యం తాగడం ప్రారంభించారు. అయితే ఈ మధ్యలో ఏమి జరిగిందనే దానిపై పూర్తీ విచారణ జరపనున్నారు పోలీసులు.