అందర్నీ పిచ్చోళ్ళని చేసిన పునర్నవి 😂😂 .. పెళ్లి లేదు గిల్లి లేదు
Timeline

అందర్నీ పిచ్చోళ్ళని చేసిన పునర్నవి 😂😂 .. పెళ్లి లేదు గిల్లి లేదు

బిగ్ బాస్ ఫేమ్ టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం తన నిశ్చితార్థపు ఉంగరం చూపిస్తూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతేకాదు, తనకు ప్రపోజ్ చేసింది ఉద్భవ్ రఘునందన్ అని, తాను ఓకే చెప్పానని పోస్టు చేసేసరికి, అందరూ పునర్నవి నిశ్చితార్థం జరిగిందని నిర్ధారించేశారు. అయితే అదంతా ఓ వెబ్ చిత్రం పబ్లిసిటీ కోసమేనని అర్థమవుతోంది.

తాజాగా పునర్నవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో మరింత స్పష్టత వచ్చింది. ఉద్భవ్ రఘునందన్, పునర్నవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ చిత్రం ఆహా యాప్ లో నవంబరు 13న విడుదల కానుంది.

దీనిపై పునర్నవి స్పందిస్తూ… “తప్పలేక ఒప్పుకున్నా. అసలైన క్రేజీ రైడ్ ఇంకా ముందుంది. మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి. త్వరలోనే కమిట్ మెంటల్ వచ్చేస్తోంది” అంటూ వివరించింది. మొత్తమ్మీద తన వెబ్ ఫిల్మ్ కు పున్నూ ఓ రేంజిలో పబ్లిసిటీ సాధించింది. చూడబోతే ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ కు కూడా పాత్ర ఉన్నట్టు భావించాలి! పునర్నవికి నిశ్చితార్థం, పెళ్లి అనగానే తనవంతు వైరాగ్యపు పోస్టులతో సీన్ ను పండించాడు.