సాక్షి టీవీ లో పూరి జగన్ టాక్ షో
Timeline

సాక్షి టీవీ లో పూరి జగన్ టాక్ షో

సినిమా హీరో హీరోయిన్లు టీవీలో టాక్ షో లు చేయడం బాలీవుడ్ మరియు హాలీవుడ్ లో ఎప్పటినుండో ఉన్న కల్చర్. అయితే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం మన హీరో హీరోయిన్లు ఇలాంటి షోలు చేయగలరా అనే ఒక అనుమానం మాత్రం అభిమానుల్లో ఎప్పుడూ ఉండేది. తెలుగు తెరకు పరిచయమైన మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తెలుగు బుల్లితెరపై లక్ష్మి టాక్ షో అనే ప్రోగ్రామ్ తో ఎంట్రీ ఇచ్చింది. అప్పటివరకు ఏ హీరోలు కానీ హీరోయిన్ లు బుల్లితెరపై షో లు చేసిన దాఖలాలు లేవు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో టాప్ హీరో గా పేరున్న నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు తో మా టీవీ ద్వారా బుల్లి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ ప్రోగ్రాం లో చిరంజీవి కూడా హోస్ట్ గా చేశారు. ఇక యంగ్ హీరోల విషయానికి వస్తే ఎన్టీఆర్, హీరో నాని బిగ్ బాస్ షోల ద్వారా టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఓటిటి పుణ్యమా అని చెప్పి హీరోయిన్ సమంత కూడా ఆహా ప్లాట్ఫామ్ లో ఒక చాట్ షో చేస్తుంది.

ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ వంతు కూడా వచ్చేసింది. ఇప్పటికే తన పూరి మ్యూసింగ్స్ ద్వారా యూట్యూబ్ లో రోజు కొత్త కొత్త టాపిక్ లపై ఆయన స్పందన తెలియజేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఆ వీడియోలను బేస్ చేసుకొని ఆయన ఒక టీవీ షో కూడా చేయబోతున్నట్టు సమాచారం. ఈ టీవీ షో ఒక పాపులర్ తెలుగు న్యూస్ ఛానల్ లో రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే పూరి జగన్నాథ్ ఈ షోని సాక్షి టీవీతో కలిసి చేయనున్నట్టు మనకున్న సమాచారం. ఈ టీవీ షో పుడమి అని వార్తలు ప్రచారం చేస్తున్నాయి నెట్టింట్లో. అధికారిక ప్రకటన త్వరలో వస్తుందేమో మరి

Leave a Reply

Your email address will not be published.