పీవీ సింధు… బ్యాడ్మింటన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. ఎప్పుడో 2009లో సబ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మొదలైన ఆమె ప్రయాణం… ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగే వరకు వచ్చింది. అటు రియో ఒలింపిక్స్‌లోనూ రజతంతో.. ఆ ఘనత సాధించిన తొలి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్రకెక్కారు.

అయితే గత కొన్ని రోజులుగా ఈ హైదేరాబద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పై రక రకాల గాసిప్ వార్తలు వస్తున్నాయి. తల్లి తండ్రులతో గొడవైందని, వాళ్లకు దూరంగా ఉంటుందని రూమర్లు షికారు చేసాయి. వాటాన్ని ఖండిస్తూ సింధు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇది జరిగి కేవలం రెండు వారలు మాత్రమే అవుతుంది. ఇంతలోనే అభిమానుల గుండెల్లో బాంబు పేల్చినంత పని చేసింది సింధు.

అవును , సింధు తన ట్విట్టర్ అకౌంట్ లో నేను రిటైర్ అవుతున్నాను , డెన్మార్క్ ఓపెన్ సిరీస్ చివరిది అంటూ ట్వీట్ పెట్టింది. దానితో పాటు తన భావాలను కూడా పంచుకుంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయితే రిటైర్ అనే పదం మాత్రమే పెద్దగా కనబడి ఉండటంతో అందరు సింధు రిటైర్ అవబోతుందా అని కంగారు పడ్డారు.

కానీ పూర్తిగా చదివితే కానీ అర్ధం కాదు తాను రిటైర్ అవుతుంది గేమ్ నుండి కాదట, తన చుట్టూ ఉన్న నెగటివిటీ నుండి అని చెప్పుకొచ్చింది. అయితే ఇది సింధు కావాలనే చేసినట్టు తెలుస్తుంది ఆ వార్త మొత్తం చదివితే.