యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్
Timeline

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

ఈరోజుల్లో యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ చూడటం అందరికీ సరదా మాత్రమే కాదు ఎంతో మంది అవి చూసి నేర్చుకుంటారు కూడా. ఎంతో మంది కుకింగ్ చానళ్ళు నడుపుతున్నారు. ప్రతీ రాష్ట్రం నుండి వైరల్ ఛానల్స్ చాలా ఉన్నాయి. అయితే తమిళనాడు లో బాగా ఫేమస్ అయిన ” విలేజ్ కుకింగ్ ఛానల్ ” ను ఒక ముసలాయన మరియు ముగ్గురు యువకులు రన్ చేస్తున్నారు. యూట్యూబ్ చానళ్లకు సినిమా సెలెబ్రిటీలు రావడం పెద్ద విశేషం ఏమి కాదు. కానీ ఒక రాజకీయ నాయకుడు , అది కూడా పీఎం క్యాండిడేట్ రావడం అనేది అది నిజంగా గొప్పే. అలాంటి సంఘటనే ఇపుడు జరిగింది.

విలేజ్ కుకింగ్ ఛానల్ కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అతిధి గా వచ్చారు. వారితో కలిసి వంట చేసారు. ఆ తరువాత వారితో కలిసి కూర్చొని, వారు వడ్డించిన మష్రూమ్ బిర్యాని తిన్నారు. వారి వంటను మెచ్చుకోవడమే కాకుండా, వారి భవిష్యత్తు ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. వారికి సహాయం చేస్తాను అని మాట కూడా ఇచ్చారు.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published.