ఇటలీ వెళ్లిన రాహుల్ గాంధీ .. కౌంటర్లు ఇస్తున్న బీజేపీ

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  ఆదివారం నాడు  ఇటలీకి వెళ్లారు.  ఇటలీలోని మిలాన్ కు వెళ్లినట్టుగా సమాచారం. ఆదివారం నాడు ఉదయం రాహుల్ గాంధీ  ఖతార్ ఎయిర్ లైన్స్ ద్వారా ఇటలీకి వెళ్లారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ మిలాన్ కు ఎందుకు వెళ్లారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే దేశంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన సమయంలో రాహుల్ వెళ్లడం విమర్శలకు దారి తీసింది. ఇక బీజేపీ ఇదే మంచి ఛాన్స్ అనుకోని కాంగ్రెస్ కు కౌంటర్లు ఇస్తుంది.