వామ్మో.. ఐసీయూలోకి వర్షపు నీరు

9

ఈరోజు మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధి సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలోకి వర్షం నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రి సెల్లార్‌లోనే ఐసీయూ విభాగం ఉండటంతో ఎమెర్జెన్సీ విభాగంతోపాటు ఇతర వార్డుల్లో వర్షం నీరు చేరింది. ఐసీయూలోకి ఒక్కసారిగా నీరు చేరడంతో రోగులు భయాందోళనకు గురయ్యారని ఆసుపత్రి బయట ఉన్న వారి బంధువులు తెలిపారు.

ఆసుపత్రి సిబ్బంది బకెట్లతో ఐసీయూలోని వర్షం నీటిని బయటకు మళ్లించారు. మాదాపూర్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా వర్షపునీరు చేరడంతో  ట్రాఫిక్‌ స్తంభించింది.