తల్లి యాంకర్, తండ్రి యాక్టర్, కొడుకు హీరో గా
Timeline

తల్లి యాంకర్, తండ్రి యాక్టర్, కొడుకు హీరో గా

తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎన్ఠీఆర్ నుండి మొదలు పెడితే చిరంజీవి వరకు అందరు కుటుంబాల నుండి ఎంతో మంది నటులు తెరకు పరిచయమయ్యారు. ట్యాలెంట్ ఉన్నవాళ్లు నిలదొక్కుకున్నారు. ఇప్పుడు మరో సినీ కుటుంబం నుండి యువ తార తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు . అతను ఎవ్వరో కాదు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల కుమారుడు రోషన్ కార్తీక్ కనకాల.

రాజీవ్ కనకాల దివంగత తల్లిదండ్రులు కూడా ప్రముఖ సినీనటులు అనే విషయం తెలిసిందే. అంతే కాదు యాక్టింగ్ స్కూల్ ను స్థాపించి ఎందరినో నటులుగా తీర్చిదిద్దారు. అలాంటి కుటుంబం నుంచి ఇప్పుడు మూడో తరం సినీ పరిశ్రమలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి రోషన్ ఎంత వరకు తనను తాను ప్రూవ్ చేసుకుంటాడో వేచి చూడాలి.