బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తరువాత బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం మొదలయింది. ఈ కేసులో విచారణ సుశాంత్ ప్రేయసి , స్నేహితురాలు రియా అరెస్ట్ వరకు వెళ్ళింది. అయితే ఆ తరువాత రియా సిబిఐ పోలీసులతో విచారణలో భాగంగా పలువురు బాలీవుడ్ యాక్టర్ల పేర్లు కూడా తెలిపింది అంటూ పలు టీవీ చానళ్ళు కథనాలు ప్రచారం చేసాయి .

ఇందులో ముఖ్యంగా , మొట్ట మొదటగా బయటకు వచ్చిన పేరు రకుల్ ప్రీత్ అంటూ టీవీ చానళ్ళు హంగామా చేసాయి. రకుల్ మాత్రమే కహ్డు ఇందులో శ్రద్ధ , దీపికా పదుకునె వంటి తరాల పేర్లు కూడా ప్రచారం చేసారు.

కానీ రకుల్ ప్రీత్ మాత్రం మీడియా సర్కస్ చేస్తుంది మా జీవితాలతో అంటూ ధైర్యంగా కోర్టు మెట్లు ఎక్కింది . ఏ ఆధారాలు లేకుండా తమ ప్రతిష్ట కు సినిమా కెరీర్ కు భంగం కలిగేలా టీవీ ఛానళ్ల కథనాలు ఉన్నాయి అంటూ మీడియా పై కేసు వేసింది.

నిన్న ఈ కేసు పై తీర్పు ఇస్తూ టీవీ చానళ్లకు నోటీసు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు .

మీడియా రూల్స్ పాటించాలని , తదుపతి ఆదేశాల వరకు ఎటువంటి తప్పుడు కథనాలు ప్రచురించడానికి వీల్లేదని చెప్పింది .