అవును ..అతి త్వరలో కొణిదెల స్టూడియోస్ !
Timeline

అవును ..అతి త్వరలో కొణిదెల స్టూడియోస్ !

మొన్నామధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయన కుమారులు అల్లు అర్జున్, శిరీష్ , బాబీ కలిసి అల్లు రామలింగయ్య 99 వ జయంతి రోజున తమ సొంత సినీ స్టూడియోని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి, దానికి అల్లు స్టూడియోస్ అని నామకరణం కూడా చేసి శంకుస్థాపన కూడా చేసారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో బడా హీరోల , నిర్మాతల కుటుంబాలు స్టూడియోస్ ఉన్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ , రామానాయుడు స్టూడియోస్ , మహేష్ బాబు పద్మాలయ స్టూడియోస్ ఉన్నాయి . కొందరేమో సినిమా థియేటర్ల బిజినెస్, సినిమా నిర్మాణం లో కూడా ఉన్నారు.

ఈ రెండిట్లో కి రావాలని మెగా ఫ్యామిలీ ఎప్పటి నుండో ఆలోచనలో ఉందన్నట్టుగా వార్తలొచ్చాయి. సినిమా నిర్మాణంలోకి అంజనీ ప్రొడక్షన్స్ పేరుతొ చిరు ఎప్పుడో దిగారు. ఆ తరువాత కుమారుడు రామ్ చరణ్ తన తల్లి పేరుతొ కొణిదెల ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసాడు. అయితే ఇపుడు స్టూడియోస్ నిర్మాణం కూడా చేపట్టాలనేది చిరు చిరకాల కోరిక అని , దానిని సాకారం చేసే ఆలోచనలో పడ్డారట మెగా కుటుంబం.

అయితే తండ్రి కోరికను తనయుడు రామ్ చరణ్ త్వరలో తీర్చబోతున్నారని, హైదరాబాద్‍‌లో కొణిదెల స్టూడియోస్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.

అయితే చిరంజీవి స్టూడియో ని వైజాగ్ లో నిర్మించబోతున్నారని , అందుకే జగన్ కి దగ్గర కావాలని చూసారని , ఆ తరువాత హైదరాబాద్ లో మరో స్టూడియో నిర్మించబోతున్నట్టు , అందుకే కెసిఆర్ ని కూడా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారని వార్తలు షికారు చేసాయి.

ఒకానొక సమయంలో , అంటే మొన్న కరోనా విపత్తులో కూడా కెసిఆర్ దగ్గరకు చిరు ఇండస్ట్రీ గురించి వెళితే భూముల కోసమే వెళ్లాడని బాల్లయ్య సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారమే లేపారు.

ఏది ఏమైనా కొణిదెల స్టూడియోస్ త్వరలో రూపు దాల్చుకోవడం ఖాయమనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి . అవసరం అయితే రెండు చోట్ల స్టూడియోని నిర్మించడానికి చిరు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.