“RRR” అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

టాలీవుడ్ నుంచి మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక భారీ పాన్ ఇండియన్ చిత్రం విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.అదే దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి మరో బిగ్గెస్ట్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR.స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీంల పాత్రల్లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే వీటితో పాటుగా ఈ చిత్రంపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి.ఈ చిత్రాన్ని మొదలు పెట్టినప్పుడే రాజమౌళి రిలీజ్ డేట్ ను ప్రకటించేసారు.దానికి తోడు పలుమార్లు దానికే స్టిక్ అయ్యి ఉన్నామని కూడా ప్రస్తావించారు.కానీ సినీ ప్రేక్షకుల మదిలో మాత్రం ఎక్కడో అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అన్న అనుమానం ఇప్పటికీ మెదులుతూనే ఉంది.

కానీ విడుదల తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని అనుకున్న సమయానికే ఈ చిత్రం ఈ ఏడాది వేసవి బరిలో నిలబోతుంది అని ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ చెప్పేసారు.ఈరోజు విజయవాడలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చరణ్ ఈ విషయాన్ని ఖరారు చేసేసారు.మొత్తానికి మాత్రం ఈ చిత్రం అనుకున్న సమయానికే విడుదలవ్వబోతుంది అని చెప్పాలి.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం