చరణ్ బహుమతి సూపర్

17

వివాదాల దర్శకుడు వర్మ ఎప్పుడు ఎవరిని పోగుట్టుడుతాడో తెలియదు, ఎప్పడు ఎవర్ని తిడతాడో తెలియదు. ఇండస్ట్రీలో ఏ విషయం గురించైనా వర్మ మాట్లాడితే అది సెన్సేషన్ గా మారిపోతుంది. తాజాగా వర్మ సైరా ట్రైలర్ ని పొగుడుతూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి సినిమాకు తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఉండే ఈ యన ఇంకా సైరా గురుంచి ఏం మాట్లాడడం లేదేంటా అనే సమయంలో సైరా గురుంచి తన మనసులోని మాటను ముందుంచేసాడు.

తాజగా సైరా రెండో ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ట్రైలర్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా సైరా ట్రైలర్ మరియు చిత్ర నిర్మాత రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. చిరు స్థాయికి తగ్గ చిత్రం తీసి చిరంజీవికి మరియు తెలుగు ప్రేక్షకులకు గొప్ప బహుమతిని ఇచ్చిన నిర్మాత రామ్ చరణ్ కి ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎప్పుడు ఏదో ఒక లొసుగు వెలికి టెస్సి కొంత వెటకారాన్ని జోడించి చెప్పే ఈయన సైరా గురుంచి మాత్రం ఏమి అనకుండా ముక్కుసూటిగా చెప్పడంతో అందరు ఆశ్చర్యనికి గురవుతున్నారు. వర్మ మారిపోయాడా ఏంటి అంటూ గుసగుసలు మొదలుపెట్టేసారు కూడా . మరి దీని వెనుక కారణం ఏంటి అనేది తెలియదు కానీ వర్మ పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం సైరా అభిమానులకు భారీ ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.