టీచర్స్ డే: టీచర్స్ విస్కీ బాటిల్ తో వర్మ వివాదాస్పద ట్వీట్

భారతదేశంలోనే సంచలన దర్శకుడిగా పేరొందాడు రాంగోపాల్ వర్మ. దీనికి కారణం కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న హడావిడే. గతంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేసిన ఈ దర్శకుడు.. కొద్దిరోజులుగా తన పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వివాదాస్పద అంశాలపై సినిమాలు చేస్తున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక, తాజాగా టీచర్స్ డేను పురస్కరించుకుని వర్మ కొన్ని వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఇప్పుడవి హాట్ టాపిక్ అవుతున్నాయి.

గురుదేవో భవ.. ఆచార్య దేవోభవ అంటూ ప్రతి సెప్టెంబర్ 5వ తేదీన చదువుతోపాటు సంస్కారం నేర్పిన గురువులను పూజించుకుంటాం.. స్మరించుకుంటాం. వీలైతే వారి ఆశీర్వాదం తీసుకుంటాం. సహజంగా అందరూ చేసే పని ఇది. ఇందుకు డిఫరెంట్ రాంగోపాల్ వర్మ. డే ఏదైనా వైవిధ్యం ఎక్కువగా చూపిస్తుంటారు.. సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజున అదే వెరైటీ ట్విట్ తో శుభాకాంక్షలు చెప్పారు వర్మ.

టీచర్స్ డే రోజున.. టీచర్స్ విస్కీ బాటిల్ తో లింక్ పెట్టి ట్వీట్ చేశారు. టీచర్స్ డే రోజు టీచర్లు.. టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా అంటూ క్వశ్చన్ చేశారు. జస్ట్ అస్కింగ్ అంటూ కామెంట్ చేశారు. తనను మంచి విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు ఫెయిల్ అయ్యారని.. అందువల్ల తనకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదంటూ తన వాదన వినిపించారు సార్ వారు. తాను ఓ బ్యాడ్ స్టూడెంట్ అంటూ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తన గురువులంతా.. మంచి ఉపాధ్యాయులు కాలేకపోయారని వాళ్ళంతా చెడ్డ వాళ్ళేనని ట్విట్ చేశారు వర్మ గారు.