‘పాగల్’ గా వస్తున్న విశ్వక్ సేన్
Timeline

‘పాగల్’ గా వస్తున్న విశ్వక్ సేన్

విశ్వక్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ‘పాగ‌ల్’ చిత్రం షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. పాగల్ అంటూ టైటిల్ అనౌన్స్ చేసి అందరిలోనూ ఆసక్తిని పెంచాడు విశ్వక్‌. అయితే ఇదో విభిన్నమైన ప్రేమకథ అని తెలుస్తోంది. ఈ మూవీని బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తుండగా.. నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘దిల్’ రాజు చేతుల మీదుగా నూతన దర్శకుడు నరేశ్ స్క్రిప్ట్ అందుకున్నాడు. విశ్వక్‌ పై రానా క్లాప్ ఇవ్వడంతో లాంఛనంగా షూటింగ్ మొదలైంది.