ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఆలోచనలు ఆకాంక్షలు చాలా మందికి అర్థం కావు. అందుకే ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ మోదీ ఓ విజన్ ఉన్న నేత అని అన్నారు. మోదీ ఇండియాను సమర్థంగా ముందుకు నడుపుతున్నారని ఆయన ప్రశంసించారు. అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో రతన్ టాటా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు . ‘కరోనా టైంలో లాక్డౌన్ పెట్టడం మామూలు నిర్ణయం కాదు. దేశ ఆర్థికపరిస్థితి దెబ్బతింటుందని మోదీకి తెలుసు.అయినప్పటికీ ఆయన ప్రజల ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించారు. దేశ సమైఖ్యత విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడలేదు.. దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో పారిశ్రామిక వేత్తల పాత్ర ఎంతో ఉంది. నేను అయితే అందుకు సిద్ధంగా ఉన్నాను.’ అని రతన్ టాటా పేర్కొన్నారు.
Timeline
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ప్రశంసల వర్షం
- by Telugucircles
- December 20, 2020
- 0 Comments
- 3 Views
