Breaking News :

మళ్ళీ ఉదయించబోతున్న రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకాల ఫోర్జరీ కేసు తరువాత కనిపించకుండాపోయారు. అప్పటినుంచి ఆయనకు సంబంధించిన ఏ వార్త సమాచారం కూడా లేదు. టీవీ9 సౌత్ ఇండియాలోనే అది పెద్ద నెట్వర్క్ గా నిలిచిందంటే రవిప్రకాష్ కృషి అంత సాధారణమైన విషయం ఏంకాదు. ప్రస్తుతం రవి ప్రకాష్ లేని లోటు మీడియా రంగంలో ఎవరు కూడా భర్తీ చేయలేకపోతున్నారంటే అయన మార్క్ శైలి ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

అలాంటిది ఇప్పుడు రవిప్రకాష్ ఇప్పుడు ఎం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఎలాంటి స్ట్రాటజీతో మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ తో ప్రారంభిస్తాడనేది అతని సన్నిహితులు, మీడియా మిత్రులతో పాటుగా కొందరు రాజకీయ నేతలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రవిప్రకాష్ వీళ్లందరి అనాలిసిస్ కి దొరికితే అతడు రవిప్రకాష్ ఎందుకు అవుతాడు. అందుకే తనకు సంబందించిన ప్రతి ఆక్టివిటీని రవిప్రకాష్ గోప్యంగా ఉంచుతున్నారు.

ఇక, మీడియా రంగం గూర్చి మాట్లాడుకుంటే రవిప్రకాష్ ముందు.. రవిప్రకాష్ తరువాతే అని మాట్లాడుకోవాలి. డిజిటల్ మీడియాలోను అయన తీసుకువచ్చిన మార్పులు అలాంటివి మరి. న్యూస్ ప్రజెంటేషన్ నే మార్చేస్తూ.. సౌత్ నలుమూలల ప్రతినిధులను ఏర్పరచి ఎంతో మందికి ఉపాధిని కల్పించాడు. రవిప్రకాష్ మొదట్లో బడా నేతలను స్టూడియోలో కూర్చో బెట్టి ప్రశ్నించే తీరన్నా.. మీడియా అన్నా.. నేతలకు భయం కూడా ఉండేది. అంతేకాదు ఈరోజు కొందరు మీడియాలో కీలక వ్యక్తులుగా రాణిస్తున్నారంటే అది రవిప్రకాష్ బిక్షే అని చెప్పాలి. రవిప్రకాష్ సక్సెస్ మార్కును గుర్తించి.. ఈ రంగంలోకి బిజినెస్ మ్యాన్లు సైతం ఎంటరయ్యారంటే అతడు ఈ రంగంపై ఎంత ప్రభావం చూపారనేది అర్ధంచేసుకోవచ్చు. టీవీ9 నుంచి నిష్క్రమించే సమయాన్ని ముందే ఊహించిన రవిప్రకాష్ తక్కువ సమయంలోనే మోజో టీవీని సైతం తెలుగు న్యూస్ ఛానల్స్ అగ్ర పోటీలోనే నిలిపాడంటే అది అతడికి మాత్రమే సాధ్యమయ్యే విద్య అనే చెప్పాలి.

ప్రస్తుతం రవిప్రకాష్ లేని మీడియా రంగం కూడా జీవం లేదన్నట్లుగానే నడుస్తుంది. వర్తమాన రాజకీయాలు, సామాజిక సమస్యల పట్ల ప్రస్తుత మీడియా రాజకీయాలకు లోబటే పని చేస్తున్నాయి. అంతేకాదు.. ఆ పార్టీలను ప్రోమోట్ చెయ్యడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఎవరైనా సరే తమ అనుబంధ లీడర్లను ప్రశ్నిస్తే ఆ నేతలకంటే ముందే మీడియా ఛానళ్లు తిప్పికొడుతున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు ప్రస్తుత మీడియా పరిస్థితులు ఎలా ఉన్నాయో! రవిప్రకాష్ రోజుల్లో మాత్రం మీడియా ఇంతలా మాత్రం దిగజారలేదనేది సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం.

ఇక ఆమధ్య రవిప్రకాష్ సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఛానల్ నిర్మాణంతో వస్తున్నాడని.. ఓ బడా రాజకీయ నాయకుడు రవిప్రకాష్ కి సహకరిస్తున్నాడని ఆమధ్య వార్తలు వినిపించిన మళ్ళి మాములుగానే ఆ వార్త ముగిసిపోయింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే రవి ప్రకాష్ పేరు ఉగాది తరువాత మళ్ళి వినిపించబోతుంది. రవి ప్రకాష్ రీఎంట్రీకి అంత సిద్ధం చేసుకున్నాడట. కాకపోతే రవిప్రకాష్ కొద్దిరోజులు మీడియాలో కనిపించకుండానే నడిపిస్తాడని సమాచారం. ఇంతకు ముందు ఉన్న స్ట్రాటజీతో కాకుండా రవిప్రకాష్ కొత్త స్ట్రాటజీతో రాబోతున్నాడట. ఇక రవిప్రకాష్ వస్తున్నాడన్న సమాచారంతో ఇప్పటికైనా మెరుగైన సమాజం ఉదయించాలని అతడి సన్నిహితులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారట.

Read Previous

వీడియో: ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య

Read Next

భగ్గుమన్న బంగారం