బిగ్ స్టోరీ: సినిమాలు కాదు, పవన్ అలా చేయడం వల్లే జేడీ ఔట్

జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్‌కు, తనకు మధ్య అంతరం పెరుగుతుండడంతో ఆయన ఏ క్షణమైనా పార్టీని వీడొచ్చని అందరూ అంఛనా వేస్తున్న తరుణంలో ఊహాగానాలకు అనుగుణంగానే లక్ష్మినారాయణ జనసేన పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే… అందుకు ఆయన చూపిన కారణం మాత్రం వెరైటీగా వుంది.

జనసేన పార్టీని వీడుతున్నట్లు గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. గత ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మినారాయణ గత కొంత కాలంగా పార్టీలో అంటీముట్టనట్లుగానే వుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు, పవన్ కల్యాణ్‌కు అంతరం పెరగుతోందని మీడియా కథనాలొచ్చాయి.

వాటిని అటు పార్టీగానీ, ఇటు వ్యక్తిగతంగా లక్ష్మినారాయణగానీ ఖండించలేదు. ఈలోగా గురువారం సాయంత్రం లక్ష్మినారాయణ స్వయంగా ప్రకటన విడుదల చేస్తూ.. జనసేనకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. విశాఖనుంచి పోటీ చేసే అవకాశమిచ్చిన పవన్ కల్యాణ్‌కు, తనకు ఓట్లేసిన ప్రజలకు, తనకోసం పని చేసిన ప్రజలకు కృతఙ్ఞతలు చెప్పారు. అయితే.. లేఖలో తన రాజీనామాకు కారణం పవన్ కల్యాణేనని తెలపడం మాత్రం జనసేనాధిపతికి షాకిచ్చే అంశమే.

అయితే ఎన్నికల ముందు బీజేపీని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇపుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జేడీకి ఇష్టం లేనట్టుగా తెలుస్తుంది. అదే అసలు కారణం అయి ఉండొచ్చని సమాచారం. ఎన్నికల ముందు జేడీ కూడా బీజేపీలో చేరుతారనే వార్తలొచ్చాయి కానీ పవన్ మీద అభిమానం తోనే అయన బీజేపీని కాదనుకొని పవన్ తో చేతులు కలిపి అందరిని ఆశ్చర్య పరిచారు. అయితే ఇపుడు బీజేపీతో కలిసే వ్యవహారంలో కూడా అసలు జేడీని పవన్ సంప్రదించలేదు అంతే కాకుండా నాదెండ్ల ను మాత్రమే ఢిల్లీకి తీసుకెళ్లి చక చకా పని కానిచ్చేయడం కూడా ఆయనను బాధపెట్టిందని ఇన్సైడ్ టాక్.

జేడీ లాంటి వ్యక్తి జనసేన కు చాలా బలం అయ్యారు. జగన్ కేసుని విచారించాడనే ఒకే ఒక్క కారణం తో పవన్ ఎన్నికల సమయానికి బాగానే వాడుకున్నాడు. ఆ తరువాత పక్కన పెట్టేసాడు.

అయితే అయన రాసిన లెటర్ లో కారణం వేరే అయినా, అసలు కారణం చెప్పకపోవడానికి చాలానే ఉంది. ఇపుడు అయన బీజేపీని కామెంట్ చేసి చెడు అవ్వకూడదనే సింపుల్ గా ప్రజలు ఏమనుకుంటున్నారో అది చెప్పారు.ఇప్పటికైనా పవన్ మారితే భవిష్యత్తు ఉంటుంది పార్టీకి. లేదంటే ఇక అంతే సంగతులు.

Image

Read Previous

బ్రేకింగ్: భారత్ లో కరోనా వైరస్

Read Next

చపాతి రాత్రి తింటే ఏమవుతుంది?

Leave a Reply

Your email address will not be published.