సైరా పై TV9 రచ్చ, కారణం అదేనా

53

మెగాస్టార్ చిరంజీవి పాతికేళ్ళుగా తెరకెక్కించాలి అనుకుంటున్న మెగా ప్రాజెక్ట్ తొలితరం,తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాడు. అయితే ఈ సినిమాపై ముందు నుండి వస్తున్న వివాదం మాత్రం సెటిల్ అవ్వలేదు. పైగా రోజు రోజుకి ఇంకా పెద్దదిగా మారుతుంది. ఇప్పుడు అది మరో మెట్టు ఎక్కి లీగల్ ఇష్యూ‌గా మారింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న టైమ్‌లో ఈ గొడవ సైరా టీమ్‌కి తలనొప్పిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

సినిమా కథకు తమ నుండి వివరాలు అడిగి తీసుకుని సినిమా తీశారు కాబట్టి తమకు ఏకంగా 50 కోట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ వంశంలోని అయిదో తరానికి సంబంధించిన 23 మంది కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ‘సైరా’ నిర్మాత రామ్ చరణ్ పై, చిరంజీవిపై కూడా కేసు పెట్టారు.

అయితే ఈ వివాదాన్ని TRP రేటింగులు కోసం అన్ని చానళ్లు విపరీతంగా చూయిస్తున్నాయి. అయితే TV9 మాత్రం ఇంకాస్త ఎక్కువే చూయిస్తుంది. ఆ కుటుంబీకులతో ఇంటర్వ్యూలు పెట్టడం, డిబేట్లు పెట్టడం ఇలా టాపిక్ నే హీటెక్కించి హాట్ టాపిక్ గా వాడుకొని వ్యూయర్షిప్ కొట్టేస్తున్నారు. దీని వెనక కూడా ఒక పెద్ద కారణమే ఉందని ఇండస్ట్రీ లో టాక్ మొదలైంది. ఎప్పుడు ఏ పెద్ద సినిమా ప్రీ రిలీజ్ అయినా వాటి లైవ్ టెలికాస్ట్ హక్కులు సంపాదించుకునేది TV9 ఏ. అయితే ఈ సారి ఆ ఛాన్స్ సాక్షి టీవీ పట్టేసింది. అందుకే ఛానల్ ఫోకస్ అంతా సినిమా కాంట్రవర్సీలపై తిప్పిందని సినీ విశ్లేషకులు చెప్తున్న మాట.

మరి ఈ రచ్చ ఇంక ఏ రేంజులో అవుతుందో చూడాలి.