కస్టమర్లకు జియో భారీ షాక్

26

మొబైల్స్ వినియోగించే ప్రతి ఒక్కరికీ బ్యాడ్ న్యూస్.. ఈ నెలలో అన్ని టెలికాం సంస్థలూ తమ టారిఫ్ రేట్లను పెంచనున్నాయి. డిసెంబర్ 3 నుంచి వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ వినియోగదారుల టారిఫ్ రేట్లు పెరగనుండగా.. జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా జియో డిసెంబర్ 6వ తేదీన నూతన ఆలిన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ప్లాన్ల ధరలు 40 శాతం వరకు పెరుగుతాయని జియో వెల్లడించింది. అయితే పెంచిన చార్జిలకు అనుగుణంగా కస్టమర్లకు ప్రయోజనాలను అందిస్తామని జియో తెలిపింది. ఈ క్రమంలోనే నూతన ప్లాన్లపై 300 శాతం అదనపు ప్రయోజనాలను అందిస్తామని వెల్లడించింది.

ప్రస్తుతం జియో రూ.149, రూ.222, రూ.333, రూ.444, రూ.555 ఆల్ ఇన్ వన్ ప్లాన్లను అందించనుంది. ఈ ప్లాన్లలో రోజువారీ డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ తో పాటు అదనంగా ఐయూసీ నిమిషాలను కూడా అందించనుంది. మరి టారిఫ్ రేట్లు పెరగనున్న నేపథ్యంలో మిగతా ప్లాన్ల ధరలు ఎలా ఉంటాయో వేచి చూడక తప్పదు.