రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నబ్ గోస్వామిని ఈరోజు ఉదయం మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అర్నబ్‌ను తన ఇంటి నుంచి అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఇంట్లో తనపై పోలీసులు దాడి చేసినట్లు జర్నలిస్ట్ అర్నబ్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్తున్న క్రమంలో అర్నబ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు. 2018లో రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఓ డిజైనర్‌తో పాటు ఆయన తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ ఆర్కిటెక్ట్ కూతురు అద్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసులో విచారణ మొదలుపెట్టినట్లు ఈ ఏడాది మేలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అలీబాగ్ పోలీసులు ఆ కేసులో విచారణ సరిగా చేపట్టకపోవడం వల్ల తన తండ్రి మరణించినట్లు అద్యా తన ఫిర్యాదులో ఆరోపించింది.
అంతే కాదు బుధవారం ఉదయం అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేసే సందర్భంగా ఆయన ఓ మహిళా ఆఫీసర్‌తో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాల కింద మరో కేసు ( FIR against Arnab Goswami ) నమోదైంది.
వీటిపై వాదనలు విన్న కోర్టు ఈ రోజు అర్ణబ్ గోస్వామిని 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ కి పంపుతూ తీర్పును వెలువరించింది. అంటే నవంబర్ 18 వరకు అర్ణబ్ రిమాండ్ లోనే ఉంటారు. అయితే రిపబ్లిక్టీ. మ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రేపు బెయిల్ కోసం అర్ణబ్ ప్రయత్నిస్తారని తెలుస్తుంది.