Breaking News :

కెసిఆర్ కి రేవంత్ సవాల్

ఆర్టీసీ సమ్మెకు మద్ధతుగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పట్ల, కార్మికుల పట్ల కేసీఆర్ వైఖరి సరికాదని మండిపడ్డారు. ఆర్టీసీకి మూడు వేల కోట్లు అప్పులున్నాయని ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. మరి రూ.30 వేల కోట్ల అప్పున్న మెట్రో రైల్ ను ఏంచేస్తారని కేసీఆర్‌కి సవాల్ విసిరే ప్రశ్నను సంధించారు.

అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీరును కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉందని, ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని అంటున్న కేంద్ర ప్రభుత్వంకు ఆర్టీసీ కార్మికుల చావుల బాధ్యత కూడా ఉందని మండిపడ్డారు. ఆలయాలను పునరుద్ధరించడానికి, సెక్రెటేరియట్ నిర్మించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కేసీఆర్‌కి ఆర్టీసీకి ఇచ్చేందుకు రూ.49 వేల కోట్లు లేవా అంటూ ప్రశ్నించారు.

Read Previous

ఇంగ్లిష్ మీడియం వల్ల మత ప్రచారాలకు ఇబ్బంది అంటున్న పవన్ కళ్యాణ్

Read Next

ఇంగ్లీష్ లో RRR: హాలీవుడ్ స్టూడియోస్ తో రాజమౌళి ఒప్పందం