తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఓటమికి మూటకట్టుకుంది ఈరోజు వెలువడిన GHMC ఎన్నికల ఫలితాల్లో. గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లను కాపాడుకోలేకపోవడం తో పాటు 10 అంటే 10 సీట్లను కూడా సంపాదించుకోలేకపోయింది. ముందస్తు ఎన్నికల్లోనే ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత తన శాసన సభ సభ్యులను కోల్పోయింది. అంతకు ముందు హుజూర్నగర్, మొన్న దుబ్బాక లో కూడా భారీ ఓటమిని చవిచూసిన కారణంగా ఆ పార్టీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
ఎప్పటినుండో ఆ పదవి కోసం ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి కి ఆ పదవి వారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగితావారితో పోలిస్తే టీడీపీ నుండి వచ్చిన సరే రేవంత్ కాంగ్రెస్ కోసం చాలానే కష్టపడుతున్నారు. కాంగ్రెస్ నేతలే ఆయనతో సరిగా లేకపోవడం కూడా పార్టీకి నష్టాన్ని చేకూర్చింది. అంతే కాకుండా మీడియా కూడా కాంగ్రెస్ ని పక్కన పెట్టేసినట్టుగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి .