అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. సమావేశాల తొలిరోజునే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నదనే విషయాలను తెలుసుకోనున్నా రు.

ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న సమావేశాలకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, సాధారణ పరిపాలనశాఖ అధికారులతో, సాయంత్రం పోలీసు అధికారులతో పోచారం సమీక్ష జరుపనున్నా రు.