బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్: మరో ఇద్దరు కీలక నేతలు కమల దళంలోకి..

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు, సిట్టింగ్‌లు, మాజీలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేసి కమల దళంలో చేరుతున్నారు.

తెలంగాణలో ఇప్పటికే టీడీపి, కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నేతలు బీజేపిలో చేరగా.. ఇంకొందరు నేతలు కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఒకప్పుడు ముఖ్య నేతల్లో ఒకరిగా పేరున్న రేవూరి ప్రకాష్‌రెడ్డి, రవీంద్ర నాయక్ ఇద్దరూ ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు ముఖ్య నేతలందరితో కలిసి ఢిల్లీ వెళ్లిన రేవూరి ప్రకాష్ రెడ్డి, రవీంద్ర నాయక్ లు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.