పీకే ఫ్యాన్స్ జోకర్స్, వాళ్లెలా ఓయూ జేఏసీ లో: ఆర్జీవీ
Timeline

పీకే ఫ్యాన్స్ జోకర్స్, వాళ్లెలా ఓయూ జేఏసీ లో: ఆర్జీవీ

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కార్యాలయంపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు. వర్మ ఇటీవలే పవర్‌స్టార్‌ పేరిట ఓ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. సినిమా ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పలు చానెళ్లకు ఇంటర్యూ ఇచ్చారు. తన కార్యాలయానికి ఎవరైనా రావొచ్చని ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాపై అనుమానాలు ఉన్న ఎవరైనా తన వద్దకు వచ్చి మాట్లాడొచ్చని చెప్పారు.

దీనికి స్పందించిన జనసేన నేతలు నందగిరి సతీశ్‌ కుమార్‌, సంపత్‌నాయక్‌, రమేష్‌, నాగరాజు, దుర్గాప్రసాద్‌ తదితరులు ఓయూ జేఏసీ నుండి వచ్చాం అంటూ జూబ్లీహిల్స్‌లోని వర్మ కార్యాలయానికి వెళ్లారు. ఆయనను కలిసేందుకు వచ్చామని కార్యాలయ సిబ్బందికి తెలియజేశారు. కానీ వర్మ స్పందించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన జనసేన కార్యకర్తలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. వెళుతూవెళుతూ కార్యాలయ అద్దాలను పగులకొట్టారు.

అయితే ఈ ఘటనపై ఆర్జీవీ ఘాటుగానే స్పందించారు కనే కామెడీ చేసేసారు. అంతే కాకుండా పబ్లిసిటీకి మరింతగా వాడేసుకున్నారు. రాత్రంతా లైవ్ ఇంటర్వ్యూ లు ఇస్తూ పవర్ స్టార్ సినిమాకి మరింత మైలేజ్ తెచ్చుకున్నారు.

ఈ ఘటనలో ట్విస్ట్ ఇస్తూ వారిపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ఆర్జీవీ, అంతే కాకుండా నను ఎవరు కలవలేదు అని, వాళ్లకు వాళ్ళే కొట్టుకొని చొక్కాలు చించేసుకున్నారని అవన్నీ సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయని తెలిపారు.

అంతే కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఓయూ అన్నా ఓయూ జేఏసీ అన్నా నాకు చాల గౌరవం ఉందని కానీ ఇలాంటి జోకర్లు ఓయూ జేఏసీ లో ఎలా ఉన్నారని , ఇంతకీ వాళ్ళు ఓయూ జేఏసీ కి చెందిన వారేనా అంటూ కామెంట్లు చేసారు ఆర్జీవీ.

దీనికి స్పందిస్తూ తెరాస నేత క్రిశాంక్ , ఓయూ జేఏసీ 2009 లో చాల స్టూడెంట్స్ యూనియన్స్ తో కలిసి తెలంగాణ ఉద్యమమే అజెండా గ ఏర్పడింది అని , 2009 లో జనసేన లేదని , అంతే కాకుండా తెలంగాణ ఉద్యమానికి పాటు పడలేదని అలాంటప్పుడు వాళ్ళు ఓయూ జేఏసీ ఎలా అవుతారని తెలిపారు.

దీనితో ఇది ఇపుడు రాజకీయ రచ్చ గ మారే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది

Leave a Reply

Your email address will not be published.