బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు
Timeline

బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు

మాదకద్రవ్యాల సంబంధిత కేసులో అరెస్టు అయి దాదాపు నెల రోజుల తరువాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తికి బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్‌పై ఆమెకు బెయిల్ లభించినట్లు సమాచారం. అంతే కాకుండా రియా పది రోజులు పోలీస్ స్టేషన్ లో కనబడాలని , తన పాస్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని , కోర్టు పర్మిషన్ లేకుండా అబ్రాడ్ వెళ్లకూడదని సూచించింది. ఒకవేళ ముంబై వదిలి వెళ్లాలంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి తెలియజేయాలని కోరింది.

రియా తో పాటుగా సుశాంత్ వర్కర్స్ అయిన దీపేష్ & సామ్యూల్ మిరాండా కు కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు కానీ రియా తమ్ముడు శౌయిక్ కి మాత్రం బెయిల్ మంజూరు చేయలేదు