సినీ ఆరంగేట్రం చేయనున్న జబర్దస్త్ కూతురు

14

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ మధ్యనే బాధ్యతాయుతమైన పదవిలో కూర్చోవడంతో జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చింది. ఇటీవలే కూతురు అన్షుమాలిక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇప్పుడు రోజా ఫ్యామిలీకి సంబందించిన వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. అదేంటంటే రోజా కుమార్తె తెరంగ్రేటం.

నిజానికి సినిమాలలో అడపదపా కనిపిస్తూనే జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది రోజా. ఇక ఆమె రాజకీయంగా బిజీగా మారడం, వచ్చే రొజుల్లో మరిన్ని బాద్యతలు నెత్తిన పడే అవకాశం ఉండటంతో ఆమె ఇక సినిమాలకు, షోలకి గుడ్ బై చెప్పినట్టేనని ఆమె సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం.

దీంతో తన నట వారసురాలుగా తన కుమార్తె అన్షుమాలిక సినీ ఆరంగేట్ర ప్రయత్నాలు రోజా మొదలుపెట్టినట్టు సమాచారం. అన్షు వయసు కూడా కథానాయికగా ఆరంగేట్రం చేసేందుకు సరిపోతుందని భావించిన రోజా ఆమెకు ఫోటో షూట్ కూడా చేయించినట్టు సమాచారం. ఇప్పటికే తనకు కాస్త పెద్ద దిక్కు అనుకున్న నిర్మాతలకు అన్షూ ఫోటో ఆల్బమ్‌ లని కూడా రోజా పంపారట. రోజా పోలికలతో పాటు తండ్రి కూడా పెద్ద దర్శకుడు కూడా కావటంతో ఆయన దగ్గరే అన్షూ శిక్షణ అందుకుందని, ఇక అవకాశాలు రావటమే లేట్ అనే ప్రచారం ఫిలింనగర్‌ లో గట్టిగా వినిపిస్తోంది.