రొమాంటిక్: రన్నింగ్ బస్ ను పరిపూర్ణంగా వాడేసిన ఆకాష్ పూరి
Entertainment Timeline Tollywood

రొమాంటిక్: రన్నింగ్ బస్ ను పరిపూర్ణంగా వాడేసిన ఆకాష్ పూరి

Romantic: If You Are Mad I'm Your Dad Full Video Song

టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన తాజా మూవీ ”రొమాంటిక్”. ఆకాష్ సరసన ఢిల్లీ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. రొమాన్స్ & యాక్షన్ తో కూడిన ఇంటెన్స్ లవ్ స్టోరీతో ఈ సినిమా వస్తోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ కంటెంట్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘ఇఫ్ యు ఆర్ మ్యాడ్ ఐయామ్ యువర్ డాడ్’ అనే వీడియో సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. పెద్దగా ఖర్చు ఏమిలేకుండానే సింపుల్ గా బస్ లోనే సాంగ్ నడిపించారు. ఆకాష్ – కేతిక శర్మ ఆకట్టుకొనేలా వుంది. మరి ఆ వీడియో సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.